కేటీఆర్ చెప్పింది అక్షర సత్యం: ఏపీలో సౌకర్యాలపై సీపీఐ నారాయణ

Publish Date:Apr 30, 2022

Advertisement

సీపీఐ పార్టీ సీనియర్ నేత  నారాయణ ఏమి చేసినా.. ఏది మాట్లాడినా ఓ సంచలనం అవుతుంది. ఏపీ అసెంబ్లీలో 151 సీట్లు గెలిచిన సీఎం జగన్ ను పొగుడుతూనే ఇంకా బానిస బతుకేనా? అంటూ చురకలంటించినా, ప్రధాని మోడీని వరసపెట్టి ఏకేసినా.. ఆర్కే రోజా నియోజవర్గం నగరిలో ఉపాధి కూలీగా మారి, పని చేసినా... ‘అదొక బ్రోతల్ హౌస్’ అని బిగ్ బాస్ షోని పోల్చినా.. సినీ నటి కంగనా రనౌత్ ని ‘కాస్ట్లీ బిచ్చగత్తె’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినా.. వైసీపీ- బీజేసీ సహజీవనం చేస్తున్నాయన్నా నారాయణ రూటే సెపరేట్ గా ఉంటుందనేది నిర్వివాదాంశం. అంతుకే నారాయణ ఏం చేసినా.. ఏది మాట్లాడినా సంచలనంగానే ఉంటాయి.

తాజాగా.. సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘ఏపీలో కరెంట్ లేదు.. నీళ్లు ఉండవు.. రోడ్లు అధ్వాన్నం.. అసలు మౌలిక సదుపాయాలే ఉండవు‘ అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభ వేదిక నుంచి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని నారాయణ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో నారాయణ ఆంధ్రా- తమిళనాడు సరిహద్దును పరిశీలించి.. ఇరు రాష్ట్రాల్లోని రోడ్ల పరిస్థితిని పోల్చి మరీ నారాయణ వ్యాఖ్యానించడం విశేషం. ఏపీలో రోడ్లు గుంతలతో నిండిపోయి ఉన్నాయని, పొరుగు రాష్ట్రాల్లో చక్కగా ఉన్నాయని చెప్పారు. ఏపీ రోడ్లను తమిళనాడు రోడ్లతో పోల్చి చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఒక పక్కన ఫైరైపోతున్న సమయంలో తాను ఆయన మాటలతో తాను ఏకీభవిస్తున్నానని నారాయణ మాట్లాడడం గమనార్హం.

మొన్నా మధ్యన బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుతూ.. ‘అదొక బ్రోతల్ హౌస్’ అని నారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. బిగ్ బాస్ హౌస్ అనేది ఒక సోషల్ క్రైమ్ అని, దాని వల్ల సమాజానికి ఉపయోగం ఏమీ లేదని అన్నారు. భారతదేశానికి 1947లో వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం కాదని, అది ఒక భిక్ష అని సినీనటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై నారాయణ స్పందిస్తూ.. ‘కంగన ఒక విలాసవంతమైన బిచ్చగత్తె’ అంని నిప్పులు చెరగడం అందర్నీ ఆశ్చార్యానికి గురిచేసింది. మోడీ ప్రధాని అయ్యాయే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్న ఆమె మాటల్ని తిప్పికొడుతూ.. దేశ స్వాతంత్ర్యం గురించి మాట్లాడే అర్హతే కంగనకు లేదని,  ఆ వ్యాఖ్యలు ఆమె బానిస మనస్తత్వాన్ని సూచిస్తున్నాయని విరుచుకుపడ్డారు. దేశ ప్రజలకు కంగన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం గమనార్హం.

బీజేపీ తనకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నప్పుడు నారాయణ స్పందిస్తూ.. ఏపీలో వైసీపీ- బీజేపీ సహజీవనం చేస్తున్నాయని.. మధ్యలో దూరిన పవన్ కు బీజేపీ రోడ్ మ్యాప్ ఇందుకిస్తుంది? ఇవ్వదని తేల్చి చెప్పేయడం కమలం- ఫ్యాన్ గుర్తుల రహస్య బంధాన్ని బయటపెట్టేయడం ఆసక్తిగా మారింది. గత ఏడాది మే నెలలో నారాయణ ఉపాధి హామీ కూలీగా మారడం విశేషం. చిత్తూరు జిల్లాలోని ఆర్కే రోజా సొంత ఇలాకా నగరి నియోజకవర్గంలోని అయనంబాక చెవురులో రెండు రోజులు ఉపాధి హామీ కూలిపనులు చేయడంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లెఫ్ట్ పార్టీలు ఉద్యమించి, పార్లమెంట్ లో  సాధించుకున్న పథకం అని ఆయన చెప్పడా గమనార్హం.
ఇటీవలే కమ్యూనిస్తు నేత నారాయణ విశాఖపట్నంలోని శ్రీ శారదాపీఠాన్ని సందర్శించడం, పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిని కలుసుకోవడం సంచలనంగా మారింది. సమ సమాజ స్థాపనకు జీవితాన్నే ధారపోసిన నారాయణ ఇలా స్వామీజీ దర్శనం చేసుకోవడం, నారాయణకు స్వామీజీ కాషాయం కండువా కప్పి ఆహ్వానించడం, స్వామీజీకి శిరసు వంచి, చేతులు జోడించి నారాయణ నమస్కారం చేయడం ఆసక్తిగా మారింది.

ఇటీవలే ఏపీలోని వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి విధానాన్ని తప్పుపడుతూ సీపీఐ నారాయణ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సరిగా జరగలేదని, ఎమ్మెల్యేలను సంప్రదించకుండా జిల్లాల్ని విభజించడం జగన్ సొంత వ్యవహారం కాదని కామెంట్ చేయడానికి నారాయణ వెనుకాడలేదు. అసలు జిల్లాల విభజనకు గవర్నర్ ఏ విధంగా అంగీకరించారని ప్రశ్నించారు. చేతిలో అధికారం ఉంది కదా అని జగన్ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు చేస్తారా? అని నారాయణ నిలదీయడం గమనించదగ్గ విషయం. గవర్నర్ గా తాను ఉంటే ఆత్మహత్య చేసుకుని ఉండేవాడిని అని నారాయన అనడం సంచలనం అయింది. ఏపీలో విద్యుత్ ధరలను పెంచినప్పుడు కూడా ప్రభుత్వ నిర్ణాయినిక వ్యతిరేకంగా నారాయణ స్పందించారు. ప్రధాని మోడీ, జగన్ ప్రజలపై విద్యుత్ ధరలు పెంచి భారం మోపుతున్నారని ఆక్షేపించారు.

జాతీయ రహదారి పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే.. ఊరుకోబోమని, భూములు ఇవ్వకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని అధికారులు బెదిరించడం దుర్మార్గమని అన్నారు. అలా చేస్తే అధికారుల చేతివేళ్లు కట్ చేస్తామని నారాయణ హెచ్చరించడం సంచలనం అయింది. 

By
en-us Political News

  
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.